Friday, November 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు 

58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు 

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి
గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు గ్రూప్స్ కి  సంబంధించిన పుస్తకాలు కొనుగోలు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఏ భాస్కరరావు తెలిపారు. గురువారం స్థానిక జిల్లా గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఆయన ప్రారంభించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు ఎండి ఎండి అవైస్ ఉర్ రెహ్మాన్ చిస్తి జాతీయ పతాకావిష్కరణ చేశారు. జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి,  గ్రంథాలయ పితామహులు ఎస్ అర్.రంగనాథన్ చిత్రపటానికి. పూలమాలల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా  అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రంథాలయానికి రావాల్సిన సెస్ బకాయిలు చెల్లించుటకు జిల్లాలోని మున్సిపాలిటీలకు, గ్రామపంచాయతీలకు తగిన ఆదేశములు ఇస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ ఇంచార్జ్ కార్యదర్శి  సుధీర్ అతిథులుగా పోలిశెట్టి అనిల్ కుమార్, పోతంశెట్టి వెంకటేశ్వర్లు, మాటూరి బాలేశ్వర రావు, జంపాల అంజయ్య, కరిపే నరసింగరావు, సి అక్కినేనిపల్లి నరసింహారావు, పి. శంకర్ రెడ్డి, బట్టు రామచంద్రయ్య, సల్లావుద్దీన్, కైరం కొండ వెంకటేష్, వడిచెర్ల కృష్ణ యాదవ్, ఎండి మజార్, చల్లగురుగుల రఘుబాబు, గుర్రాల శ్రీనివాసరావు, మంగ ప్రవీణ్, పిట్టల బాలరాజు, కొల్లూరు రాజు, రీడర్స్ భగయత్  పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -