- Advertisement -
నవతెలంగాణ – బెజ్జంకి
మండల పరిధిలోని తోటపల్లి గ్రామ శివారులో మూడు ప్రదేశాల్లో సుమారు 60 టన్నుల అక్రమ నిల్వలను స్వాధీనం చేసుకున్నామని టాస్క్ ఫోర్స్ అధికారులు తెలిపారు. ప్రతి ఇసుక అక్రమ నిల్వపై కేసు నమోదు చేశామని ఎస్ఐ సౌజన్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.స్వాధీనం చేసుకున్న ఇసుక అక్రమ నిల్వలను తహసీల్దార్ సమక్షంలో వేలం నిర్వహించనున్నట్టు ఎస్ఐ పెర్కొన్నారు.
- Advertisement -