Saturday, January 10, 2026
E-PAPER
Homeజాతీయందంతేవాడలో 63 మంది మావోయిస్టుల లొంగుబాటు

దంతేవాడలో 63 మంది మావోయిస్టుల లొంగుబాటు

- Advertisement -

36 మందిపై రూ. 1.19 కోట్లకు పైగా రివార్డు
వివరాలు వెల్లడించిన బస్తర్‌ రేంజ్‌ ఐజీపీ సుందర్‌రాజ్‌ పట్టిలింగం

నవతెలంగాణ-చర్ల
సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలో శుక్రవారం 63 మంది మావోయిస్టులు లొంగిపోయారు. బస్తర్‌ రేంజ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ సుందర్‌రాజ్‌ పట్టిలింగం ఈ వివరాలను వెల్లడించారు. ఒడిశాలోని మాడ్‌లో పశ్చిమ బస్తర్‌ దర్భా డివిజన్‌లో చురుకుగా పని చేస్తున్న వీరు ఛత్తీస్‌గఢ్‌లో చేపట్టిన ‘పునరావాసం ద్వారా పునర్జన్మ’ (పూనా మార్గెం) ప్రచారంతో ఆకర్షితులై జనజీవన స్రవంతిలో కలిసిపోయారని అన్నారు. లొంగిపోయిన వారిలో 18 మంది మహిళలు, 45 మంది పురుషులు ఉన్నారు. వారిలో 36 మందిలో.. ఏడుగురు రూ.8 లక్షల రివార్డు, మరో ఏడుగురు రూ.5 లక్షలు, 8 మంది రూ.2 లక్షలు, 11 మంది రూ. లక్ష, ముగ్గురు రూ. 50 వేల రివార్డు (మొత్తం రూ.1,19,50,000) తీసుకున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. భారత ప్రభుత్వం, ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం, దంతేవాడ పోలీసులు సీఆర్పీఎఫ్‌, స్థానిక పరిపాలన.. అధికారులు ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పడానికి, పునరావాసం కల్పించడానికి సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహించడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నారని ఐజీ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -