Sunday, July 20, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంరష్యాలో 7.4 తీవ్రతతో భూకంపం..సునామీ హెచ్చరిక జారీ

రష్యాలో 7.4 తీవ్రతతో భూకంపం..సునామీ హెచ్చరిక జారీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్: రష్యాలో భారీ భూకంపం సంభవించింది. రష్యా తీరంలో రిక్టర్‌ స్కేల్‌పై 7.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పానికి పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు వెల్లడి కాలేదు. ముందస్తు జాగ్రత్తగా పౌరులు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని అధికారులు సూచనలు జారీ చేశారు. దీనికి కొన్ని నిమిషాల ముందు రిక్టర్‌ స్కేలుపై 6.7 తీవ్రతతో భూకంపం నమోదైనట్లు తెలిపారు.  

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -