Sunday, October 26, 2025
E-PAPER
Homeతాజా వార్తలు7 ఏళ్ల బాలికపై వీధి కుక్కల మూకుమ్మడి దాడి.. వీడియో

7 ఏళ్ల బాలికపై వీధి కుక్కల మూకుమ్మడి దాడి.. వీడియో

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : వరంగల్ జిల్లా కేంద్రంలోని న్యూశాయంపేటలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న 7 ఏళ్ల శ్రీజ అనే బాలికపై వీధి కుక్కలు మూకుమ్మడి దాడి చేశాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. అయితే, బాలికపై దాదాపు 7 నుంచి 8 వీధి కుక్కలు దాడికి దిగాయి.

ఇది గమనించి స్థానికులు వాటిని తరమడంతో బాలికకు ప్రాణాపాయం తప్పినట్లైంది. ఇక, గాయాలపాలైన శ్రీజను చికిత్స నిమిత్తం వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీధి కుక్కల బెడద పెరిగిపోతున్నా మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రతి దాడి తర్వాత నామమాత్ర చర్యలు తీసుకొని, తర్వాత అసలు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఈ ఘటన శనివారం ఉదయం జరిగినట్లుగా సీసీ టీవీ ఫుటేజ్‌లో కన్పిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -