Tuesday, December 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా 72వ అఖిల భారత సహకార వారోత్సవాలు 

ఘనంగా 72వ అఖిల భారత సహకార వారోత్సవాలు 

- Advertisement -

రైతుల అభివృద్ధి కోసమే సహకార సంఘం కృషి చేస్తుంది
మండల ప్రత్యేక అధికారి మరియాన్న 
నవతెలంగాణ – నెల్లికుదురు

పిఎసిఎస్ నెల్లికుదురు ఆధ్వర్యంలో 72 అఖిల భారత సహకార వారోత్సవాలను ఘనంగా నిర్వహించినట్లు మండల ప్రత్యేక అధికారి మరియాన్న పి ఏ సి ఎస్ నెల్లికుదురు పి ఐ సి జే మనోహర్ తెలిపారు. మంగళవారం కొనుగోలు కేంద్రంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు తక్కువ పెట్టుబడుతూ ఎక్కువ లాభాలు పొందేందుకు ఆయిల్ ఫామ్ వేసుకుంటే మంచిదని తెలిపారు. ఈనెల 14వ తేదీనుండి 20వ తేదీ వరకు ఈ వారోత్సవాలను నిర్వహించబడతాయని దేశానికి రైతు వెన్నుముక అయితే రైతులకు సహకార సంఘం వెన్నుముక లాంటిది అని అన్నారు. రైతుల  అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలిపారు. రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటు సేవలు అందిస్తున్నమని రైతులు సంఘాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు సంఘ అభివృద్ధికి ప్రతి ఒక్కరి  సహకారం అందించాలని  తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ యాదగిరి, సిబ్బంది కె . శీను,పి నాగరాజు. పి నగేష్. వి. నాగరాజు, ఎస్. యాకయ్య, పి. పూర్ణ రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -