నవతెలంగాణ – ఆర్మూర్
ఆలూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో శుక్రవారం అంతర్జాతీయ సహకార సంఘాల 72 వ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ తబూరి శ్రీనివాస్ జెండా ఆవిష్కరించి మాట్లాడుతూ.. రైతుల అభివృద్ధే సహకార సంఘాల అసలైన లక్ష్యం అని సహకార వ్యవస్థ బలపడితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత మన్నికపడుతుంది అని. మా సంఘం ద్వారా రైతులకు రుణాలు, ఎరువులు, విత్తనాలు, ధాన్యం కొనుగోలు సేవలు పారదర్శకంగా అందిస్తున్నాం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు కళ్ళెం భోజ రెడ్డి ,కళ్ళెం సాయ రెడ్డి ,బార్ల సంతోష్ రెడ్డి ,ఇంగు గోవర్ధన్ ,సింగేడి మల్లు బాయి ,ప్రమోదు కుమార్ ,అరే రాజేశ్వర్ ,వెల్మ నర్స రెడ్డి,పచ్చుక లసుం బాయి ,కట్ట నర్సయ్య ,గొల్ల గంగాధర్ , మార్కెట్ కమిటి డైరెక్టర్ మల్లా రెడ్డి, ఏఈవో వసుధం, సంఘం కార్యదర్శి తొర్తి మల్లేష్, సిబ్బంది ముత్యం,దేవ రాజ్, గంగాధర్,గంగారం ,సురేష్ రైతులు పాల్గొన్నారు.



