- Advertisement -
– 79% మహిళా, 71.14% పురుష ఓట్ల నమోదు
నవతెలంగాణ-రామారెడ్డి
పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మండలంలోని 18 గ్రామ పంచాయతీల పరిధిలో గురువారం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మండల పరిధిలో 27061 మంది ఓటర్లలో పురుషులు 12843, మహిళలు 14218 మంది ఓటర్లు ఉన్నారు. గురువారం జరిగిన ఎన్నికల్లో 20365 ఓట్లు నమోదు కాగా , పురుషులు 9137, మహిళలు 11228 ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
- Advertisement -



