అలరించిన సాంసృతిక కార్యక్రమాలు
నవతెలంగాణ – పెద్దవూర
మండల కేంద్రంలోని శాంతినికేతన్ ఉన్నత పాఠశాల లో 79 వ స్వాతంత్ర్య వేడుకలు శుక్రవారం ప్రిన్సిపాల్ నడ్డి ఆంజనేయులు అధ్యక్షతన దేశభక్తి ఉట్టిపడేలా ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు సిబ్బంది కలిసి ఈ వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగరవేసి, విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి దేశభక్తి గీతాలు పాడారు. దేశభక్తిని, స్వాతంత్య్ర పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ ప్రసంగాలు చేశారు. అనంతరం చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలలో బాగంగా నృత్యాలు చేశారు. విద్యార్థులు స్వాతంత్ర ఉద్యమం, దేశభక్తి గురించి ఉపన్యాసాలు ఇచ్చారు. అనంతరం విద్యార్థులు దేశాభివృద్ధికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. అందరూ కలిసి దేశభక్తిని చాటుకున్నారు. ఈ వేడుకలు విద్యార్థులలో దేశభక్తిని పెంపొందించేలా, స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకునేలా జరిగాయి. వేడుకల్లో పాల్గొన్నవారందరికీ మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సంధ్య, సలీమ, రేణుక, మైముద్, మౌనిక, జ్యోతి, శైలజ, విజయ, కోమలి, లలిత, వాణి, సైదులు, నాగేందర్, శ్రీనివాస్, శ్రీ లక్ష్మీ, రమీజ, మహేష్, పాల్గొన్నారు.
శాంతినికేతన్ లో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES