- Advertisement -
నవతెలంగాణ -ముధోల్
నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లోని ముక్తాదేవి గల్లీలో పెద్ద గంగాధర్ కు చెందిన ఎనిమిది మేక పిల్లలు కుక్కల దాడిలో మృతి చెందాయి. బాదితుని కథనం ప్రకారం.. శనివారం రాత్రి తన మేకలను కొట్టంలో ఉంచి ఇంటికి వెళ్లి పోయాడు. ఆదివారం తెల్లవారుజామున మేకల కొట్టం వద్దకు వచ్చి చూడగా ఎనిమిది మేక పిల్లలను కుక్కల దాడిలో మృతి చెందాయి. ప్రభుత్వం స్పందించి ఆర్థికంగా ఆదుకోవాలని బాధితుడు కోరారు.
- Advertisement -