– ఎల్లారెడ్డి ఆస్పత్రికి తరలింపు
నవతెలంగాణ-నాగిరెడ్డిపేట్
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలం మాల్‌తుమ్మెద గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 8 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాల ప్రిన్సిపాల్ తులసి తెలిపిన వివరాల ప్రకారం.. ప్రాథమిక పాఠశాలలోని 54 మందికి గాను మంగళవారం 48 మంది విద్యార్థులు హాజరయ్యారు. 48 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం వారిలో ఆదర్శ ప్రేమ్, దుర్గాప్రసాద్, క్లేమంత్, శశివర్ధన్, ప్రదీప్, హర్పిత్, రోహిత్, సాయి తేజ అనే ఎనిమిది మంది విద్యార్థులు కడుపు నొప్పిగా ఉందని తెలపటంతో వెంటనే 108 వాహనంలో ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఎల్లారెడ్డి ఆర్డీఓ పార్థసింహారెడ్డి పర్యవేక్షించారు. మధ్యాహ్న భోజన శాంపిల్స్ సేకరించి పరిశీలనకు పంపినట్టు ఆర్టీఓ తెలిపారు.
మధ్యాహ్న భోజనం వికటించి.. 8 మంది విద్యార్థులకు అస్వస్థత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



