Thursday, December 18, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయం10 నెలల్లో 8 యుద్ధాలు ఆపా : డొనాల్డ్‌ ట్రంప్‌

10 నెలల్లో 8 యుద్ధాలు ఆపా : డొనాల్డ్‌ ట్రంప్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: తాను ఎనిమిది యుద్ధాలు ఆపానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి చాటింపు వేసుకున్నారు. ఇందుకు టారిఫ్‌లే కారణమని పేర్కొన్నారు. ఆంగ్లభాషలో ‘టారిఫ్‌’ అనే పదం తనకు చాలా ఇష్టమైన పదం అని ట్రంప్‌ పునరుద్ఘాటించారు.

‘పది నెలల్లో ఎనిమిది యుద్ధాలను ఆపాను. ఇరాన్‌ అణు ముప్పును నాశనం చేశాను. గాజాలో యుద్ధాన్ని ఆపి.. మూడు వేల సంవత్సరాల్లో పశ్చిమాసియాలో తొలిసారి శాంతిని నెలకొల్పా. ఎంతోమంది బందీలను విడుదల చేయించాను’ అని ట్రంప్‌ తెలిపారు. అదేవిధంగా సుంకాల గురించి కూడా ట్రంప్‌ ప్రస్తావించారు. అమెరికాలో 18 ట్రిలియన్‌ డాలర్ల పెట్టుబడులు సాధించగలిగామని ఈ సందర్భంగా తెలిపారు. ఇదంతా సుంకాల కారణంగానే సాధ్యమైందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -