నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని నాగల్ గావ్ గ్రామంలో గురువారం పేకాట స్ఠావరాలపై దాడులు చేశారు. ఈ క్రమంలో తొమ్మిది మందిని అదుపులో తీసుకోవడం జరిగిందని జుక్కల్ ఎస్సై నవీన్ చంద్ర తెలిపారు. జుక్కల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగల్ గావ్ గ్రామ శివారులోని నిర్మానుష్య ప్రాంతంలో పలువురు పేకాట ఆడుతున్నట్టు సమాచారం అందుకున్నామని తెలిపారు. బిచ్కుంద సర్కిల్ ఇన్స్పెక్టర్ రవీకుమార్ ఆధ్వర్యంలో బిచ్కుంద ఎస్సై , పెద్ద కొడప్ గల్ ఎస్సై , జుక్కల్ ఎస్సైలు దాడులు చేశారు. ఇందులో భాగంగా 9 మందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని తెలిపారు. వారి నుంచి రూ.10 వేల 700, 9 మొబైల్ ఫోన్లు, 8 ద్విచక్ర వాహనాలు స్వాదీనం చేసుకున్నామని తెలిపారు. అనంతరం వీరిని జుక్కల్ పీఎస్ కు తరలించామని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఎస్సై నవీన్ చంద్ర తెలిపారు.
9 మంది పేకాట రాయుళ్ళ అరెస్టు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES