అరవింద్ ఎ.వి రచించిన “90’s కిడ్ మ్యూజింగ్స్” పుస్తక ముఖచిత్రాన్ని కేంద్ర సాహితీ అకాడమీ అవార్డు గ్రహీత, ప్రసిద్ధ రచయిత్రి ఓల్గా, సీనియర్ రచయిత కుటుంబరావు కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఓల్గా మాట్లాడుతూ.. “90’s కిడ్ మ్యూజింగ్స్” తెలంగాణ మారుమూలలోని తండా బాల్యం తాలూకు కథనాలను రికార్డ్ చేసిందన్నారు. ఇప్పటివరకు తెలుగు సాహిత్యంలో మనకు పరిచయం లేని తండా బాల్యం ఇందులో ప్రత్యేకంగా కనబడుతుందన్నారు. బాల్యం ఎవరికైనా ఒకటే కానీ, పుస్తక ముఖచిత్రంపై వున్న పూల పూల కోడితో వున్న అనుబంధం వల్ల దానికంటూ అదనపు అందాన్ని చేకుర్చుకుందన్నారు. ఈ పుస్తకం అజు పబ్లికేషన్ ప్రచురణలో సంక్రాంతికి వస్తుందన్నారు.
సీనియర్ రచయిత, దర్శకులు అక్కినేని కుటుంబరావు మాట్లాడుతూ.. ఈ పుస్తకం డ్రాప్ట్ చదువుతూ నా బాల్య స్మృతుల్లోకి వెళ్లాను అని గుర్తుచేసుకున్నారు. తెలంగాణలోని ఒక తండాలో పుట్టిపెరిగిన అరవింద్ అనుభవాల అక్షరీకరణనే “90’s కిడ్ మ్యూజింగ్స్” పుస్తకంగా మన ముందుకు రాబోతుందని హర్షం వ్యక్తంచేశారు.
“90’s కిడ్ మ్యూజింగ్స్” పుస్తక ముఖచిత్రం ఆవిష్కరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



