Tuesday, October 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గాలికుంటు వ్యాధి రహిత మండలంగా తీర్చిదిద్దుదాం 

గాలికుంటు వ్యాధి రహిత మండలంగా తీర్చిదిద్దుదాం 

- Advertisement -

పశువైద్యాధికారి శివరాజ్ 
నవతెలంగాణ – మిడ్జిల్ 

మూగజీవాలు పశువులు, గేదలు గాలికుంటు వ్యాధితో ఎన్నో చనిపోతున్నాయని, ప్రభుత్వము ప్రతి సంవత్సరము ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు పశువైద్య సిబ్బంది ఆధ్వర్యంలో ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ప్రారంభిస్తున్నట్లు పశు వైద్య డాక్టర్ శివరాజ్ చెప్పారు. మంగళవారం మండల కేంద్రంలోని పశు వైద్య కేంద్రంలో వైద్య సిబ్బందికి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బుధవారం మండలంలోని కొత్తపల్లి, వాడ్యాల్, మల్లాపూర్ గ్రామంలో మూగజీవాలకు ఉచిత గాలికుంటూ వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం ఆరంభిస్తున్నట్లు ఆయన చెప్పారు. గాలికుంటు వ్యాధి సోకడం వలన పశువులలో ఉత్పాదక శక్తి , పునరుత్పత్తి శక్తి ,సామర్థ్యం కొంటుపడుతుంది అని పాడి రైతులకు ఆర్థికంగా ఎక్కువ నష్టం  వస్తుందని తెలిపారు.

ప్రభుత్వం మండలంలోని అన్ని గ్రామాలలో ఉచిత టీకాలు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. పశువులలోని వ్యాధి లక్షణాలను శరీర ఉష్ణోగ్రత 104F నుండి 106 F పెరిగి పశువులు నిరసించిపోతాయి. నోరు మరియు గిడ్డల మధ్యలో బొబ్బలు ఏర్పడి పొక్కులు , పుండ్లుగా మారి నోటి నుంచి చొంగ కారుతూ ఉండడంతో వ్యాధి సోకినట్లు గుర్తించవచ్చని రైతులకు సూచించాలని చెప్పారు. వ్యాధి సోకిన ఆవుల, గేదెల పాలు తాగిన దూడలుచనిపోయే ప్రమాదం ఏర్పడుతుందని అన్నారు.

3 నెలలు వయసు దాటిన దూడలకు , పెద్ద పశువులకు, చూడి పశువులకు ఆరు నెలలకు ఒకసారి వ్యాధి నిరోధక టీకాలు ఇప్పించే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. మండలంలోని అన్ని గ్రామాల రైతులు  పశువులకు మా పశు వైద్య సిబ్బందికి సహకరించి ఉచిత గాలికుంటు నివారణ టీకాలను వేయించి మన మండలంలో గాలికుంటు వ్యాధి రహిత మండలం గా తీర్చిదిద్దడానికి రైతులు సహకరించాలని కోరారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -