నవతెలంగాణ – కంఠేశ్వర్
ఈనెల 18 తలపెట్టిన బీసీ బందుకు సహకరించాలని హోల్ సేల్ క్లాత్ అసోసియేషన్ అధ్యక్షులు కన్న శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి బాలె మురళీ కోశాధికారి కన్న రాజ్ కుమార్ ని నిజామాబాద్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఇవ్వదల్చిన 42 శాతం రిజర్వేషన్లను కొందరు అగ్రవర్ణాల వారు కోర్టులో కేసి వేసి నిలిపివేయడంతో ఈనెల రాష్ట్ర బంద్ కు పిలుపును ఇచ్చిన బీసీ రాష్ట్ర జేఏసీ నాయకులు ఆర్ కృష్ణయ్య మరియు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఈ బందుకు సహకరించమని నిజామాబాదులోని పలు సంస్థలను కలుసి వారి సహకారం కోరడం జరిగింది. ఈరోజు నిజామాబాద్ హోల్ సేల్ క్లాత్ మర్చంట్ అసోసియేషన్ కార్యవర్గం వారిని కలిసి వారి సహకారం కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్, దర్శనం దేవేందర్, కొయ్యడ శంకర్, కోడూరు స్వామి శ్రీలత, విజయ్ బసవసాయి బాలన్న, సత్యనారాయణ, వాసంజయ రుక్మిణి తదితరులు పాల్గొన్నారు.
18న తలపెట్టిన బీసీ బందుకు సహకరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES