- Advertisement -
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ధరూర్ మండల పరిధిలోని వివిధ గ్రామాలకు సంబంధించిన లబ్ధిదారులకు సీఎం సహాయ నిధికి నమోదు చేసుకున్న వారికి సీఎం సహాయం నిధి ద్వారా మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మంగళవారం లబ్ధిదారులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కురవ హనుమంతు, జిల్లా సీనియర్ నాయకులు జి.వేణుగోపాల్, మాజీ సర్పంచులు రఘువర్ధన్ రెడ్డి వీరన్న గౌడ్, శివారెడ్డి, నాయకులు ప్రభాకర్ గౌడ్ శ్రీరాములు, రంగస్వామి ,పవన్ రెడ్డి, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -