Wednesday, October 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో పేదలకు అన్యాయం

ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో పేదలకు అన్యాయం

- Advertisement -

ఎన్ హెచ్ పి ఎస్ జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో నిజమైన అర్హులకు అన్యాయం జరిగిందని ఈ అవకతవకలతో నిజమైన అర్హులు నష్టపోతున్నారని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ ఆరోపించారు. నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గడచిన పదేళ్లుగా ఇల్లు లేని పేదలు ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నప్పటికీ, ప్రస్తుత కేటాయింపుల్లో జరిగిన పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం నిజమైన అర్హులకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు.

ఒక్కొక్క గ్రామానికి అవసరమైన సంఖ్యలో ఇళ్లు కేటాయించకుండా కొద్ది మొత్తంలో రాజకీయ అండదండలతో ఉన్నవారికి మాత్రమే లబ్ధిదారుల పేర్లు ప్రకటించారని, జాబితాలను గోప్యంగా ఉంచి పారదర్శకత లేకుండా వ్యవహరించారని, కొందరికి ఇప్పటికే ఆస్తులు, ఇళ్లు ఉన్నప్పటికీ వారికే మరోసారి ఇళ్లు మంజూరు కావడం వంటి అవకతవకలు జరిగాయని విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో స్థానిక రాజకీయ పార్టీ నాయకులు,అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వారిపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. నిజమైన లబ్ధిదారుల పేర్ల జాబితాలను అన్ని గ్రామపంచాయతీల్లో ప్రజలకు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. నిజమైన అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో అవసరమైన సవరణలు తక్షణమే చేయకపోతే పెద్ద ఎత్తున మరో పోరాటాలు సిద్ధమవుతామని స్పష్టం చేశారు.

నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లో నిజమైన అర్హులుగా  ఉన్నవారి వివరాలను సేకరించి అట్టి జాబితాను జిల్లా కలెక్టర్ గారికి అందజేసి ఇందిరమ్మ ఇండ్లు మంజూరుకై కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా నాయకులు వెంకట్రాములు, మల్దకల్ మండల అధ్యక్షుడు విష్ణు, శాంతన్న,కృష్ణ,చిన్న రాముడు, స్వామి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -