Wednesday, October 15, 2025
E-PAPER
Homeజిల్లాలుగద్వాల్ పట్టణ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

గద్వాల్ పట్టణ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

- Advertisement -

నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
వార్షిక తనిఖీలలో భాగంగా జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మంగళవారం గద్వాల పట్టణ పోలీస్ స్టేషన్ ను సందర్శించి, పోలీసుల సిబ్బంది గౌరవ వందనం స్వీకరించి, యూనిఫామ్ టర్న్ ఔట్,  స్టేషన్ రికార్డ్స్, పరిసరాలను తనిఖీ చేశారు. పోలీసు ఉద్యోగం కేవలం విధి నిర్వాహణ మాత్రమే కాకుండా, అది ప్రజల పట్ల ఉన్న బాధ్యత, సేవా భావం, మరియు చట్ట పరిరక్షణ అధికారాల సమన్వయంతో కూడిన పవిత్రమైన సేవ అని జిల్లా ఎస్పీ తెలిపారు.

 ఈ సందర్భంగా గద్వాల టౌన్ పోలీస్ స్టేషన్ పరిసరాల శుభ్రత, సిబ్బంది బ్యారక్స్, స్టేషన్ రికార్డుల మెంటేనేన్స్ ను పరిశీలించారు. సిబ్బంది కిట్ ఆర్టికల్స్ తనిఖీ చేస్తూ.. కిట్ ఆర్టికల్స్ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న స్వాధీనం చేసుకున్న/ కేసులో ఉన్న వాహనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ రికార్డు లను తనఖీ చేస్తూ ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తును చేయాలని, ఆస్థి సంబంధిత నేరాలకు సంబంధించి, అధిక నేరాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పార్ట్స్ లు గా గుర్తించి, పగలు, రాత్రి బీట్ డ్యూటీల ద్వారా నిఘా కట్టుదిట్టం చేయాలని సూచించారు. రిసీప్షన్ సిబ్బంది స్టేషన్ కు వచ్చిన ప్రతి దరఖాస్తును ఆన్లైన్ లో నమోదు చేయాలని, ఫిర్యాదిదారులతో మర్యాదగా మాట్లాడాలని అన్నారు. 

పోలీస్ అధికారులు తమకు కేటాయించిన వార్డు పై పూర్తి అవగాహన ఉండాలని, వార్డు పెద్దలతో, యువతతో సత్సంబంధాలను కలిగి ఉండాలని అన్నారు. స్టేషన్ పరిదిలో గల రౌడీ, సస్పెక్ట్ హిస్టరీ షీటర్లను చెక్ చేస్తూ ఆన్లైన్ రికార్డులో నమోదు చేయాలన్నారు. ఇతర ప్రాంతాలలో ఉండే వారి షీట్స్ ను సంబందిత ప్రాంతాలలోని స్టేషన్ హౌస్ ఆఫీసర్ లకు పంపాలని తెలిపారు.  అలాగే పాపిలోన్ డివైస్ ను వినియోగించి అనుమానిత వ్యక్తుల వేలిముద్రాలను చెక్ చేస్తూ.. పాత నేరస్తులను గుర్తించాలని అన్నారు. నేరాల అదుపులో, జరిగిన నేరాలను ఛేదించడంలో ఉపయోగపడే సిసి కెమెరాల ప్రాధాన్యతను ప్రజలకు వివరిస్తూ.. ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకునే విధంగా వారికి అవగాహన కల్పించాలని అన్నారు. 

స్టేషన్ రికార్డులైన ఎస్.సి.ఎచ్. పార్ట్ 1 – 5, జనరల్ డైరీ, ఎఫ్.ఐ.ఆర్. ఇండెక్స్, అల్ఫాబీటికల్ ఇండెక్స్, డ్యూటి రోస్టర్, విస్టింగ్ నోట్ బుక్స్, రౌడీ, సస్పెక్ట్ షీట్స్, గన్ లైసన్స్ రిజిస్టర్, ఎల్.ఎల్.ఐ., గవర్నమెంట్ ప్రాపర్టీ రిజిస్టర్, ప్రాసెస్ రిజిస్టర్,    మొదలగున్నవి చెక్ చేసి, పెండింగ్ లేకుండా చూడాలని, సిబ్బందికి వర్టికల్ వారీగా విధులను కేటాయించాలని ఎస్.హెచ్.ఓ కు సూచించడం జరిగింది. రోడ్డు ప్రమాదాల నివారణకు, సైబర్ నేరాల నివారణకు వివిధ స్కూల్స్ కళాశాలలు, పని ప్రదేశాలలో కమ్యూనిటీ పోలిసింగ్ ద్వారా అవగాహన కల్పించాలని అన్నారు. విజిబుల్ పోలీసింగ్‌ లో భాగంగా ప్రతి రోజు వాహానాల తనిఖీ నిర్వహిస్తూ, ట్రాఫిక్ నియమాలు పాటించని వాహణదారులపై చర్యలు తీసుకోవాలని, అనుమానిత వాహనాలను అదుపులోకి తీసుకోవాలని అన్నారు.  బ్లూ కోల్ట్స్ సిబ్బంది ప్రతి పాయింట్ ను తనిఖీ చేయాలని, డైల్ -100 కాల్స్ కు త్వరితగతిన స్పందించాలని సూచించారు.

మారుతున్న సమాజానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ అందుబాటులోకి తీసుకువచ్చిన సీసీటీఎన్ఎస్ – 2.0, పిటిషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్,  టీఎస్-కాప్, ఈ-సాక్ష్య, టెక్ డాటం, ఐరాడ్ దర్పణ్, సీఈఐఆర్, సైబర్ క్రైమ్‌ నేరాల నియంత్రణ, సీడీఆర్, సిఇఐఆర్ పోర్టల్, పోర్టబుల్ ఫింగర్ ప్రింట్ డివైస్, బాడీ ఓన్ కెమెరాల వంటి సాఫ్ట్‌వేర్ అప్లికేషన్లు నేరాల అదుపునకు, జరిగిన నేరాలను ఛేదించడానికి ఉపయోగకరంగా ఉన్నాయని, అన్ని అప్లికేషన్లపై పూర్తి స్థాయిలో పట్టు సాధించి, నేరాల నియంత్రణలో కీలకంగా వ్యవహించాలని సిబ్బందికి సూచించడం జరిగింది, ఇప్పుడు నేర్చుకున్న పని మీ సర్వీస్ మొత్తం ఉపయోగపడుతుందన్నారు. 

సిబ్బందితో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ….. పోలీసు ఉద్యోగం కేవలం విధి నిర్వాహణ మాత్రమే కాకుండా, అది ప్రజల పట్ల ఉన్న బాధ్యత, సేవా భావం, మరియు చట్ట పరిరక్షణ అధికారాల సమన్వయంతో కూడిన పవిత్రమైన సేవ అని తెలిపారు. పోలీసు సిబ్బంది ప్రతి చర్య ప్రజల నమ్మకాన్ని గెలుచుకునేలా ఉండాలని, సేవాభావం మరియు నిజాయితీతో విధులు నిర్వర్తించడం ద్వారా సమాజంలో మంచి మార్పు తీసుకురావచ్చని సూచించారు.  విధి నిర్వాహణలో అంకిత భావంతో పని చేయాలని. ఎవరికీ కేటాయించిన విధులను వారు సక్రమంగా నిర్వర్తించినప్పుడే పోలీసు శాఖకు మంచి పేరు వస్తుందని  అన్నారు. 

డ్యూటీ పరంగా లేదా వ్యకిగతంగా ఎలాంటి సమస్య ఉన్న నేరుగా నా దృష్టికి తీసుకురావొచ్చు అన్నారు. ఓకే చోట పని చేస్తున్నప్పుడు ఫ్రెండ్స్ లాగా కలిసి మెలసి ఉండాలని, పాజిటివ్ ఆలోచనలతో పని చెయ్యాలని అన్నారు. ప్రజలు పోలీస్ యూనిఫామ్ కు ఎంతో గౌరవం ఇస్తారో అంతే గౌరవం తో బాధ్యతగా విధులు నిర్వహించాలని అన్నారు. విధులను, పర్సనల్ లైఫ్ ను బాలన్స్ చేసుకొని ముందుకెళ్లాలని సూచించారు. పోలీస్ స్టేషన్, రికార్డుల మెయింటనెన్స్, సిబ్బంది పని తీరు పై సంతృప్తి వ్యక్తం చేశారు.

అనంతరం గద్వాల్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో జిల్లా ఎస్పీ, డి.ఎస్పీ మొక్కలు నాటరు. అప్పుడే అక్కడకు వచ్చిన న్యూ హౌసింగ్ బోర్డు చెంది పిర్యాదురాలు తో ,  జిల్లా ఎస్పీ మాట్లాడి, పిర్యాదురాలి సమస్యను తెలుసుకొన్నారు. ఇట్టి పిర్యాదు పై తగు చర్యలు తీసుకోవాలని కల్యాణ్ కుమార్ ని ఆదేశించారు. ఈ తనిఖీ లలో  ఎస్పీ  వెంబడి డి.ఎస్పీ మొగిలయ్య,  గద్వాల్ టౌన్ ఎస్సై-1 కల్యాణ్ కుమార్, ఎస్సై- సతీష్ కుమార్, ఎస్సై-3 జహాంగీర్ ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -