– వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య
నవతెలంగాణ – రాయపర్తి
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలవి కీలకమైన పాత్ర అని వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య అన్నారు. మండలంలోని మైలారం గ్రామాల్లో దాతల సహకారంతో ఏర్పటు చేసిన కెమెరాలను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కెమెరాలు నిరోధిస్తాయని, వాటి ప్రాముఖ్యతను ప్రతిఒక్కరూ గుర్తించాలన్నారు. జన సంచారం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా నేరాలను నియంత్రించవచ్చని, మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతికతతో సీసీ కెమెరాలు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. వీటిని ప్రతిచోట ఏర్పాటు చేయడం ద్వారా నేర రహిత సమాజాన్ని నిర్మించడంలో కీలకంగా మారుతున్నాయన్నారు. గ్రామాల్లో సీపీ కెమెరాల ఏర్పాటుకు స్థానికులు ముందుకు రావాలని, కెమెరాల ఏర్పటుకు సహకరించిన దాతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట సీఐ శ్రీనివాస్, రాయపర్తి ఎస్ఐ ముత్యం రాజేందర్, గ్రామస్తులు పాల్గోన్నారు.
సీసీ కెమెరాల ఏర్పాటుతో నేర నియంత్రణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES