నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
బెస్ట్ అవైలబుల్ స్కూల్ పాఠశాల విద్యార్థుల సంక్షేమానికి, ప్రత్యేక చర్యలు, విద్యాబోధనలో ఇబ్బందులు కలగకుండా చూడాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లుబట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యకు సంబంధించి మంగళవారం హైదరాబాదు నుంచి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లో ఉన్న ఇబ్బందుల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. ఎలాంటి కారణాలతో… ఆయా విద్యార్థులకు విద్యా బోధనలో ఆటంకాలు కలిగించవద్దని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు, బెస్ట్ అవైలబుల్ స్కూల్ యాజమాన్యాలతో సమావేశాలు నిర్వహించాలన్నారు.
ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తుందని అన్నారు. బడుగు, బలహీన వర్గాల పిల్లలకు మెరుగైన మౌలిక వసతులతో కూడిన విద్యా బోధనను అందించాలన్నారు.బెస్ట్ అవైలబుల్ పాఠశాలల పథకం క్రింద ఎంపిక చేసిన పాఠశాలలో చదివే షెడ్యూల్డ్ కులములు, షెడ్యూల్ తెగలకు చెందిన విద్యార్థుల సంక్షేమంపై ఆయా జిల్లాల కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని, విద్యార్థులకు అందిస్తున్న బోధన, ఆరోగ్యం, మెనూ ప్రకారం భోజనం, ఇతర మౌలిక వసతుల అమలుపై పాఠశాలలను సందర్శించి పరిశీలించాలని తెలిపారుబెస్ట్ అవైలబుల్ పాఠశాలల పథకం క్రింద ఎంపిక చేసిన పాఠశాలలో చదివే షెడ్యూల్డ్ కులములు, షెడ్యూల్ తెగలకు చెందిన విద్యార్థుల సంక్షేమంపై ఆయా జిల్లాల కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని, విద్యార్థులకు అందిస్తున్న బోధన, ఆరోగ్యం, మెనూ ప్రకారం భోజనం, ఇతర మౌలిక వసతుల అమలుపై పాఠశాలలను సందర్శించి పరిశీలించాలని తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ హనుమంత రావు, స్థానిక సంస్థల అధినం కలెక్టర్ భాస్కరరావు, జిల్లా రెవిన్యూ అధికారి జయమ్మ, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి సాహితి, తదితరులు పాల్గొన్నారు.