ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్
బీఆర్‌ఎస్‌కు గూబగుయ్యిమనేలా ఓటర్ల తీర్పు: పొన్నం
నవతెలంగాణ- జూబ్లీహిల్స్
కాంగ్రెస్ పాలనలోనే హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి చెందిందని ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ అన్నారు. ఉప ఎన్నిక సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వెంగల్‌రావు నగర్, యూసుఫ్‌గూడ కాంగ్రెస్ బూత్ స్థాయి సమావేశం మంగళవారం యూసుఫ్‌గూడలోని మహమూద్ ఫంక్షన్ హాల్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘన విజయాన్ని అందించడం పార్టీ కార్యకర్తల బాధ్యత అన్నారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, కాంగ్రెస్ సిద్ధాంతాలను ప్రతి ఓటర్‌కూ చేరవేయా లన్నారు. కలిసికట్టుగా కష్టపడితే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ గూబ గుయ్యిమనేట్టు ఓటర్లు తీర్పు ఇవ్వబోతున్నారని తెలిపారు. ఈ ఉప ఎన్నికలో ఆ పార్టీ చిరునామా గల్లంత వుతుంద న్నారు. పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో జూబ్లీహిల్స్‌లో ఏం అభివృద్ధి జరిగిందో చర్చకు రావాలని సవాల్ విసిరారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతతో కన్నీరు పెట్టిస్తూ గులాబీ పార్టీ ఓట్ల కోసం ఆరాటపడుతున్నదని విమ ర్శించారు. సునీతపై తమకు సానుభూతి ఉంది కానీ కేటీఆర్, హరీశ్ వారి రాజకీయాల కోసం ఆమెను ఇబ్బంది పెడుతున్నారని విమర్శిం చారు. దొంగ ఓట్లు కాంగ్రెస్‌కు అవసరం లేదని, బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగ ఓట్ల నమోదుకు బీఆర్‌ఎస్, బీజేపీదే బాధ్యత అన్నారు. మంత్రి వివేక్ మాట్లాడుతూ.. ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూసి జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను గెలిపించేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్ర మంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరావు, సీతక్క, ఎంపీ, సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షులు అనిల్‌కుమార్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కార్పొరేటర్‌లు విజయారెడ్డి, సీఎన్ రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ చైర్మెన్ శివసేన, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్ వెన్నెల, సీనియర్ నాయకులు అజారుద్దీన్, మురళిగౌడ్, సంజరు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పాలనలోనే జూబ్లీహిల్స్ అభివృద్ధి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES