మంత్రి దామోదర రాజనర్సింహకు వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నైటింగేల్ నర్సింగ్ స్కూల్ చేత మోసపోయిన బాధిత జీఎన్‌ఎం విద్యార్థులను ఆదుకోవాలని సామాజిక కార్యకర్త అడ్వొకేట్ డాక్టర్ లుబ్నా సార్వత్ కోరారు. ఈ మేరకు మంగళవారం ఆమె బాధిత విద్యార్థినీలతో పాటు వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కలిశారు. నైటింగేల్ బారి నుంచి వారిని తప్పించి ఆరు ప్రభుత్వ నర్సింగ్ స్కూళ్లలో వారు చదువుకుంటున్నట్టు ఆమె తెలిపారు. అయితే ఇప్పటికీ ఆర్థిక ఇబ్బందులను ఆ విద్యార్థులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వారి కుటుంబాల్లో మొదటి జనరేషన్ గ్రాడ్యుయేట్స్‌గా మారే క్రమంలో వారికి కావాల్సిన సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చినట్టు లుబ్నా సార్వత్ వెల్లడించారు.
బాధిత నర్సింగ్ విద్యార్థులను ఆదుకోండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES