Friday, October 17, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఈసీ స్పందించింది..ప్రత్యేక ఆదేశాలు అవసరం లేదు: హైకోర్టు

ఈసీ స్పందించింది..ప్రత్యేక ఆదేశాలు అవసరం లేదు: హైకోర్టు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో బోగస్‌ ఓట్ల నమోదుపై హైకోర్టులో విచారణ ముగిసింది.ఎన్నికల నిర్వహణపై ఉన్న అధికారాలు పూర్తిగా ఎన్నికల సంఘానికే చెందినవని కోర్టు తేల్చిచెప్పింది. ఈ కేసులో బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత లంచ్‌ మోషన్‌ పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు విచారణలో బోగస్‌ ఓట్లపై విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం (EC) సమాధానం ఇచ్చింది. దీనిపై స్పందించిన హైకోర్టు, ఈసీ ఇప్పటికే చర్యలు ప్రారంభించిందని, అందువల్ల ప్రత్యేక ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత కోర్టు జోక్యం చేసుకోలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -