Friday, October 17, 2025
E-PAPER
Homeజాతీయంలాయర్ రాకేష్ కిశోర్‌పై కోర్టు ధిక్కార చర్యలు

లాయర్ రాకేష్ కిశోర్‌పై కోర్టు ధిక్కార చర్యలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి బీఆర్ గవాయ్ పై లాయర్ రాకేష్ దాడికి పాల్ప‌డిన విష‌యం తెలిసిందే. తాజాగా ఆ లాయర్ పై న్యాయమూర్తి బిఆర్ గవాయ్ ఎటువంటి ఫిర్యాదు చేయకపోవడంతో.. లాయర్ రాకేష్ కిషోర్ ను పోలీసులు అరెస్ట్ చేయకుండానే వదిలేశారు. న్యాయవాది రాకేష్ కిషోర్ పై క్రిమినల్ కోర్టు ధిక్కార చర్య తీసుకోవాలని కోరుతూ..సీనియర్ అడ్వైజ్ వికాస్ సింగ్ (SCBA అధ్యక్షుడు) మరియు SG తుషార్ మెహతా జె సూర్యకాంత్ భారత అటార్నీ జనరల్‌ను ఆశ్రయించారు. ఈ సందర్భంగా సింగ్ మాట్లాడుతూ.. సీజేఐ పై చేసిన దాడి ఇంకా సోషల్ మీడియాలో కొనసాగుతోందని, లాయర్ రాకేష్ కిషోర్ తనకు పశ్చాత్తాపం లేదని ఇంకా చెబుతున్నారని గుర్తు చేశారు. అలాగే కొంతమంది ఈ దాడిని కీర్తిస్తున్నారని. ఇలాంటి దాడి చేయడానికి చాలా ఆలస్యం అయిందని చెబుతున్నారని SG తుషార్ మెహతా గుర్తు చేశారు. వారి వాదనల అనంతరం భారత అటార్నీ జనరల్ లాయర్ రాకేష్ కిశోర్ పై క్రిమినల్ కోర్టు ధిక్కార చర్యలకు సమ్మతి తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -