Friday, October 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పోలీస్ అధికారుల విచారణలో నిజాలు తేలుస్తారు 

పోలీస్ అధికారుల విచారణలో నిజాలు తేలుస్తారు 

- Advertisement -

– సాంఘిక సంక్షేమ పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ హైమావతి 
నవనవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 

విద్యాలయంలో 10 రోజుల క్రితం విద్యార్థి వివేక్ మృతి చెందడం పై విచారం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ కె హైమావతి పోలీస్ అధికారుల విచారణలో నిజాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. గురువారం హుస్నాబాద్ మండలంలోని జిల్లెల్ల గడ్డ గ్రామ శివారులోని  తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళాశాల(బాలుర) ను జిల్లా కలెక్టర్ కె. హైమావతి క్షేత్రస్థాయిలో సందర్శించారు. గురుకుల విద్యాలయం ప్రాంగణం మొత్తం కలియ తిరిగి పరిశీలించారు. విద్యార్థి మృతి సంఘటన పై విద్యార్థులను, ఉపాధ్యాయులను మృతి వివరాల గూర్చి ఆరా తీశారు.

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ప్రిన్సిపల్ ను ఆదేశించారు. గురుకులం ప్రాంగణం బయట లోపల సిసి కెమెరా పని చెయ్యాలని సూచించారు. రాత్రి సమయం విధులు నిర్వహించే అధ్యాపకులు పూర్తి శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ఎలాంటి సంఘటన జరిగిన వెంటనే అధ్యాపకులకు తెలపాలని సూచించారు. మంచి క్రమ శిక్షణ అలవాట్లు అలవర్చుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో రామ్మూర్తి, తహసిల్దార్ లక్ష్మారెడ్డి, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -