నవతెలంగాణ- హైదరాబాద్: కాఫీ వాతావరణానికి పేరెన్నిక గన్న కూర్గ్ లో మరోసారి రైడ్ ను పునః స్వాగతిస్తూ జావా యెజ్డీ మోటార్ సైకిల్స్ బ్రాండ్ వ్యూహాత్మకమైన గైడ్ ను తిరగరాస్తోంది. కంపెనీ తమ దిగ్గజపు జావా యెజ్డీ నోమడ్స్ రైడింగ్ కార్యక్రమాన్ని ఆధిపత్యంవహిస్తోంది మరియు SLN కాఫీ ఎస్టేట్ లో లెవిస్టా కాఫీ భాగస్వామ్యంతో సింగిల్-ఆరిజిన్, గోర్మెంట్ ‘యెజ్డీ కాఫీ ‘ని ప్రారంభించింది.
2018లో, పెర్ఫార్మెన్స్ క్లాసిక్ మోటార్ సైకిళ్లను ప్రారంభించడం ద్వారా మధ్యస్థ- పరిమాణం శ్రేణిలో దిగ్గజపు బ్రాండ్స్ జావా మరియు యెజ్డీలు వాపసు వచ్చినందుకు గుర్తుగా కంపెనీ సంబరాలు చేసింది. సంప్రదాయబద్ధమైన రైడింగ్ మార్గాల్ని వదిలి, జావా యెజ్డీ మోటార్ సైకిళ్లు భాగస్వామ్య విలువల పట్ల సమాజాలను మరియు ఉప సంస్కృతులను రూపొందించడంపై దృష్టి కేంద్రీకరించాయి. ఈ ప్రోత్సాహం? శాస్వతమైన బ్రాండ్ నమ్మకాన్ని కలిగించిన ప్రామాణికమైన వినియోగదారు అనుభవాలు.
‘రూట్స్ టు రూట్స్’ గా పిలువబడే 2025 జావా యెజ్డి నోమాడ్స్ బ్రూస్కేప్ , కొత్తగా ఆరంభించబడిన యెజ్డి రోడ్ స్టర్ ను ప్రదర్శన ఒక లీనమయ్యే రైడింగ్ అనుభవం. ఐడియల్ జావా జన్మస్థలం మైసూరులో ప్రారంభమైన ఈ ప్రయాణం భారతదేశపు అత్యంత ప్రామాణికమైన కాఫీ రకాలకు నిలయంగా ఉన్న మదికెరి, కూర్గ్ లో ముగిసింది. ఈ రైడ్ జాతీయ మీడియా, ఔత్సాహికులు మరియు మోటార్ సైక్లింగ్ నిపుణులకు 2025 యెజ్డీ రోడ్ స్టర్ గురించి ప్రత్యక్ష అనుభవాన్ని ఇచ్చింది. వారసత్వం, కమ్యూనిటీ మరియు కాఫీ ఉప సంస్కృతుల మధ్య లోతైన బంధానికి ప్రాధాన్యతనిచ్చింది.
“మోటార్ సైక్లింగ్ లో, దిగ్గజపు బ్రాండ్ ను రూపొందించడం అసాధారణమైన మెషీన్లను రూపొందించడానికి మించి విస్తరించింది. మేము 2018లో ప్రారంభించినప్పుడు, ఎటువంటి తయారీ కథనంతో జత కట్టలేని ప్రామాణికమైన కథలతో మేము శాశ్వతమైన క్లాసిక్స్ ను వారసత్వంగా పొందాము. మధుర స్మృతులు తలుపులు తెరిచాయి, కానీ నిజమైన బ్రాండ్ ప్రేమ మా కస్టమర్ల రైడ్ అనుభవాలు ద్వారా వర్థిల్లాయి,” అని అనుపమ్ తరేజా, సహ-స్థాపకుడు క్లాసిక్ లెజండ్స్ అన్నారు. “ లఢక్ లో నోమడ్స్ రైడ్స్ నుండి కోవ్ లాంగ్ లో సర్ఫింగ్ చేయడం వరకు ప్రామాణికమైన అనుభవాలు సృష్టించడం, దళాలతో భాగస్వామ్యాలు, మరియు హృదయాన్ని తాకే కస్టమర్ల గాథలు మా ప్రయాణాన్ని తీర్చిదిద్దాయి. 2025లో నోమెడ్స్ ను ప్రారంభించడం మరియు యెజ్డీ కాఫీలు మా ఆవిష్కరణ మార్గానికి ఉదాహరణగా నిలిచాయి. లెవిస్టా నైపుణ్యంతో రూపొందించబడిన యెజ్డీ కాఫీ మోటార్ సైక్లింగ్ మరియు కాఫీలతో పరిపూర్ణంగా మిశ్రమం చెందింది మరియు అన్వేషణ యొక్క స్ఫూర్తిని ఆనంద క్షణాలతో కలిపింది.”
ప్రత్యేక ఎడిషన్ యెజ్డీ x లెవిస్టా కాఫీ ప్యాక్ రెండు రకాలను అందిస్తోంది. కూర్గ్ లోని గొప్ప కాఫీ నైపుణ్యాన్ని గ్రహించడానికి అసాధారణంగా రూపొందించబడింది. ఒకటి మైసూర్ నగ్గెట్స్ ఎక్స్ ట్రా బోల్డ్ , AAA-గ్రేడ్ బీన్స్ నుండి 100 శాతం అరబికా, సింగిల్-ఆరిజిన్ బ్రూ. కూర్గ్ లోని సముద్ర మట్టానికి 1000 మీటర్లు ఎగువగా పండించబడింది. ఇది మధ్యస్థంగా వేయించబడిన చంద్రగిరి రకం. ఇది సున్నితమైన చాకొలెట్, టోస్టెడ్ నట్స్ మరియు కారామెల్ యొక్క గొప్ప ఆకృతిని ఇస్తుంది, నిమ్మ మరియు తడిసిన మట్టి , వేర్లు వంటి సూచనలు ఇస్తుంది. రెండవది టాప్-గ్రేడ్ రోబస్టా మరియు అరబికా బీన్స్ యొక్క పరిపూర్ణమైన మిశ్రమం. ఇది మధ్యస్థంగా వేయించబడిన కరిగిపోయే కాఫీ మరియు సుసంపన్నమైన, పరిమళభరితమైన పట్టు వంటి సున్నితమైన ఆకృతి మరియు అసాధారణమైన రుచి ఉంటుంది. మొత్తంగా యెజ్డీ x లెవిస్టా కాఫీ తరచుగా మనస్సును ఆనందపరిచే స్ట్రాంగ్ కాఫీ కోరుకునే మోటార్ సైక్లిస్ట్ లకు సాటిలేని అనుభవం ఇస్తుంది.
ప్రారంభపు ధర రూ. 1,999/-కి లభిస్తోంది- ఈ ప్రత్యేకమైన ఎడిషన్ లెవిస్టా x యెజ్డీ కాఫీ ప్యాక్ ను www.jawayezdimotorcycles.comపై ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు.
ఈశాన్య భారతదేశంలో టక్ట్ సంగ్ ట్రయల్ మరియు పంజాబ్ డా టోర్ వంటి సిగ్నేచర్ రైడ్స్ ద్వారా ఐబెక్స్ ట్రైల్ (లడఖ్, 2019)తో ప్రారంభమైన నాటి నుండి నోమెడ్స్ ప్రోగ్రాం విస్తరించింది. ఇది సంప్రదాయబద్ధమైన విలువలతో పాటు తరచు “ట్రయల్ అటాక్ “ ఆఫ్-రోడ్ శిక్షణా కార్యక్రమాలను కూడా ప్రదర్శించింది. మోటార్ సైక్లింగ్ జీవన విధానంగా జరుపుకుంటూనే ప్రయాణం, స్నేహం, మరియు స్థానికంగా లీనమవడం కూడా సూచిస్తోంది.
కంపెనీ రాక్ మరియు జాజ్ సంగీతం ఉత్సవాలతో, వీధి కళ మరియు సర్ఫింగ్ కూడా ఎంతో ఉత్సుకతగా సంబంధాన్ని కలిగి ఉంది. భారతదేశంవ్యాప్తంగా ఉన్న ఉప సంస్కృతుల్లో దృఢంగా లీనమైంది. ఈ సంబంధాలు రైడింగ్ స్నేహాన్ని జరుపుకుంటూ దాని సాహసోపేతమైన సంప్రదాయేతర నీతులను స్థాపించాయి. లడఖ్ లోని దీని కమ్యూనిటీ మరియు ఆర్మీ భాగస్వామ్యాలు ఇచ్చిన ప్రయోజనాలు ధైర్యం మరియు అన్వేషణలు యొక్క స్ఫూర్తిలో నమ్మకాలను సమర్థించాయి.
మోటార్ సైక్లింగ్ ను ఒక జీవనశైలిగా ప్రోత్సహించడానికి కట్టుబడిన ఒక కంపెనీగా, జావా యెజ్డీ మోటార్ సైకిల్స్ మరిన్ని అలాంటి సంబంధాలను సృష్టించడానికి అంకితమయ్యాయి, తమ రైడర్స్ కు అర్థవంతమైన మరియు అందమైన అనుభవాలను అందిస్తున్నాయి.