Friday, October 17, 2025
E-PAPER
Homeక్రైమ్ఫేక్ లింక్‌ల గ్యాంగ్ అరెస్ట్

ఫేక్ లింక్‌ల గ్యాంగ్ అరెస్ట్

- Advertisement -

సైబర్ నేరగాళ్లకు చెక్ – సైబర్ పోలీసుల మరో విజయం
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సమగ్ర దర్యాప్తు
సైబర్ మోసాలకు పాల్పడిన నలుగురు నిందితుల రిమాండ్‌కు తరలింపు
రూ.20 లక్షల 35 వేల మోసపూరిత లావాదేవీలలో పాల్గొన్న నలుగురు నిందితులు
బ్యాంక్ ఖాతాలు, మొబైల్ ట్రాన్సాక్షన్‌ల ఆధారంగా నేర పరిష్కారం
వివరాలు వెల్లడించిన వనపర్తి సీఐ కృష్ణయ్య
నవతెలంగాణ – వనపర్తి 

ఆన్‌లైన్‌ వేదికల్లో ఫేక్‌ లింకులు పంపి, ఫోన్‌పే, గూగుల్‌పే వంటి డిజిటల్‌ చెల్లింపు యాప్‌ల ద్వారా ప్రజల బ్యాంకు ఖాతాల నుండి అక్రమంగా డబ్బులు దొంగలించి మోసగించారని ఆర్థిక లావాదేవీలు మోసాలకు పాల్పడిన ఫేక్ లింకుల గ్యాంగ్ ను అరెస్టు చేసినట్లు వనపర్తి సిఐ కృష్ణయ్య తెలిపారు. ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఆదేశాల మేరకు గోపాలపేట పోలీసులు కేసు నమోదు చేసి, వనపర్తి జిల్లా సైబర్ క్రైమ్, గోపాల్పేట్ పోలీసులు సంయుక్తంగా సాంకేతిక ఆధారాల సాయంతో నిందితులను గుర్తించి అరెస్ట్ చేశామని వనపర్తి సిఐ కృష్ణయ్య గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ దర్యాప్తులో భాగంగా పోలీసులు రూ.2,35,000 విలువైన మోసపూరిత లావాదేవీలను ట్రేస్ చేసి, ఒక ఇండికా కారు, రెండు మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

“సైబర్ నేరాలు రోజురోజుకు కొత్త రూపాల్లో ప్రజలను మోసం చేస్తున్నాయని, ప్రతి పౌరుడు అపరిచిత లింకులు, ఫేక్‌ క్యూ ఆర్ కోడ్‌లు, అనుమానాస్పద కాల్‌లు విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎవరో తెలియని వ్యక్తులు పంపిన లింక్‌లపై క్లిక్ చేయకూడదన్నారు. ఏ రకమైన ఆన్‌లైన్ మోసానికి గురైనా వెంటనే సైబర్ హెల్ప్‌లైన్ 1930 కు ఫిర్యాదు చేయాలన్నారు. లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో నివేదించాలని సీఐ సూచించారు. ప్రజలు సహకరిస్తే సైబర్ నేరాలను పూర్తిగా అరికట్టగలమన్నారు. వనపర్తి పోలీసులు ఎల్లప్పుడూ ప్రజల భద్రత కోసం అప్రమత్తంగా ఉన్నారని సీఐ పేర్కొన్నారు. 

ఈ కేసును విజయవంతంగా చేధించిన జిల్లా సైబర్ క్రైమ్ ఎస్సై రవి ప్రకాష్, గోపాలపేట ఎస్సై నరేష్, సిబ్బంది శంకర్, సత్యనారాయణ, రమేష్ లను ఎస్పీ  అభినందించారని తెలిపారు. వనపర్తి జిల్లా పోలీసులు సైబర్ నేరాలపై నిరంతర పర్యవేక్షణ, వేగవంతమైన చర్యలు తీసుకుంటూ ప్రజల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తున్నారని సిఐ పేర్కొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -