Friday, October 17, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంతాగునీటి కోసం విద్యార్థుల ఆందోళన

తాగునీటి కోసం విద్యార్థుల ఆందోళన

- Advertisement -

ప్లేట్లు పట్టుకుని రోడ్డుపై బైటాయింపు
గద్వాల జిల్లా గట్టు మండలంలో ఘటన


నవతెలంగాణ- గట్టు
పాఠశాలలో తాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆందోళన చేశారు. గద్వాల జిల్లా గట్టు మండల పరిధిలోని ఆలూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు గురువారం ప్లేట్లు పట్టుకుని రోడ్డుపై బైటాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాఠశాలలో తాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. తక్షణం ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు.

ట్యాంకును శుభ్రం చేశాం : పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగరాజు
ఉదయం ట్యాంకులు శుభ్రం చేయడం వల్ల నీళ్లు అయిపోయాయి. రాగి జావా తాగాక పిల్లలు గ్లాసులు కడుక్కోవడానికి నీళ్లు సరిపోక కొందరు మాత్రం ఇండ్ల దగ్గరకు వెళ్లారు. మిషన్‌ భగీరథ నీళ్లు కొద్దిగా ఆలస్యంగా రావడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -