- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే హెచ్-1B వీసా ఫీజును రూ.లక్ష డాలర్లకు పెంచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ నిర్ణయంపై సొంత దేశ ప్రజలతో పాటు ప్రపంచ దేశాలు, సాంకేతిక, ఇంజినీరింగ్ రంగాల్లోని నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. ట్రంప్ ప్రకటించిన హెచ్-1B లక్ష డాలర్లు ఫీజు పూర్తిగా చట్ట విరుద్ధమని యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నిర్ణయంతో దేశంలో గ్లోబల్ టాలెంట్‌ను వాడుకోవడానికి తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని వారు దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు.
- Advertisement -



