- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: సెప్టెంబర్ నెలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినందుకు భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ, మహిళల జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధానలకు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు లభించింది. ఆసియా కప్‌లో 7 మ్యాచ్‌ల్లో 314 పరుగులు చేసిన అభిషేక్ టీ20 ఫార్మాట్‌లో ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో 308 పరుగులు చేసిన స్మృతి 50 బంతుల్లో సెంచరీతో అదరగొట్టింది. ఒకే నెలలో భారత పురుష, మహిళా క్రికెటర్లకు ఈ అవార్డు రావడం విశేషం.
- Advertisement -