- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఆదివారం నుంచి ఆస్ట్రేలియా, భారత్ మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఆస్ట్రేలియా జట్టులో ఓ మార్పు చోటుచేసుకున్నది. ఆసీస్ ఆల్‌రౌండర్ కెమరూన్ గ్రీన్ గాయపడ్డాడు. అతని స్థానంలో మార్నస్ లబుషేన్‌ను తీసుకున్నారు. తొలుత ప్రకటించిన వన్డే జట్టులో లబుషేన్‌కు చోటు దక్క లేదు. కానీ ప్రస్తుతం లబుషేన్ దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. అయిదు ఇన్నింగ్స్‌లో అతను నాలుగు సెంచరీలు చేశాడు. 50 ఓవర్స్ మ్యాచుల్లో అతను రెండు సెంచరీలు చేయడం గమనార్హం.
- Advertisement -