Friday, October 17, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంజపాన్‌ మాజీ ప్రధాని మృతి

జపాన్‌ మాజీ ప్రధాని మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: జపాన్‌ మాజీ ప్రధాని తొమిచి మురయామా (101) కన్నుమూశారు. ఈ విషయాన్ని జపాన్‌ సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ శుక్రవారం వెల్లడించింది. మురాయామా గత కొన్నిరోజులుగా అనారోగ్య కారణాలతో బాధపడుతున్నారు. ఆయన నైరుతి జపాన్‌లోని తన స్వస్థలమైన ఒయిటాలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు జపాన్‌ సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ అధిపతి మిజుహో ఫుకుషిమా ప్రకటనలో తెలిపారు.

కాగా, తోమిచి మురయామా జపాన్‌ సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ అధినేత. ఆయన జూన్‌ 1994 నుంచి జనవరి 1996 వరకు సంకీర్ణ ప్రభుత్వానికి ప్రధానిగా ఉన్నారు. రెండవ ప్రపంచ యుద్ధాన్ని ముగించిన జపాన్‌ బేషరతుగా లొంగిపోయి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. 1995 ఆగస్టు 15న తన దేశ దురాక్రమణకు గురైన ఆసియా బాధితులకు క్షమాపణలు చెబుతూ తొమిచి ప్రకటన చేశారు. ఈ ప్రకటన ద్వారా ఆయన ప్రసిద్ధి చెందారు. 2013 వరకు ఉన్న ప్రధానులు తోమిచి సంప్రదాయాన్ని కొనసాగించారు. యుద్ధ సమయంలో ఆసియా బాధితులకు అప్పటి ప్రధానులు క్షమాపణలు చెప్పారు. కానీ 2013లో అప్పటి ప్రధాని షింజో అబే మాత్రం పొరుగు దేశాలకు క్షమాపణలు చెప్పడం ఆపేశారు. దీనిపై ఆయన పలు విమర్శలు ఎదుర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -