నవతెలంగాణ-హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. షేక్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో ఆయన రిటర్నింగ్ అధికారి సాయిరాంకు అందజేశారు. ఆయన వెంట మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, ఎంపీ అనీల్ కుమార్ యాదవ్, అజారుద్దీన్, నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్, ఇతర కాంగ్రెస్ ముఖ్య నేతలు ఉన్నారు. నామినేషన్ దాఖలు సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలించారు. డప్పు చప్పళ్లతో, కళాకారుల ఆటపాటలతో యూసప్‌గూడ పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరారు. భోనాల ఎత్తుకొని మహిళా కార్యకర్తలు సందడి చేశారు. అనారోగ్య కారణాలతో ఈ ఏడాది జూన్ 8న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఆయన మృతితో జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది. బై పోల్‌లో భాగంగా నవంబర్ 11న పోలింగ్ నిర్వహించి 14న కౌంటింగ్ చేపడుతారు.
నవీన్ యాదవ్ నామినేషన్ దాఖలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES