సీపీఐ(ఎం) మండల కార్యదర్శి శంకర్ నాయక్
నవతెలంగాణ – బల్మూరు
బీసీల 42 శాతం రిజర్వేషన్లను బీజేపీ వ్యతిరేకిస్తున్నదని ద్వంద వైఖరి విడనాలను సీపీఐ(ఎం) మండల కార్యదర్శి శంకర్ నాయక్ అన్నారు. బీసీలకు రాజ్యాంగబద్ధంగా 9వ షెడ్యూల్లో చర్చి 42 శాతం రిజర్వేషన్ పెంచాలని డిమాండ్ చేస్తూ స్థానిక అంబేద్కర్ విగ్రహ ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. బీసీలకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ గవర్నర్ కు పంపిస్తే ఆమోదం తెలపకుండా నిర్లక్ష్యం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఆరు నెలల కింద రాష్ట్రపతికి కూడా పంపిస్తే అట్టి ఫైల్ ని తొక్కి పెట్టారని దీనికి కారణం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే అని అన్నారు. రిజర్వేషన్ పై అఖిలపక్ష పార్టీలతో సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీని కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు బాబర్ ఆంజనేయులు, భారీ మామ్, గడేల తిరుపతయ్య, రాజు, భాష నాయక్, చంద్రశేఖర్ రాజు తదితరులు ఉన్నారు.
బీసీలను వ్యతిరేకిస్తున్న బీజేపీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES