Friday, October 17, 2025
E-PAPER
Homeతాజా వార్తలుధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంత్రి కోమటి రెడ్డి

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంత్రి కోమటి రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – తిప్పర్తి
తిప్పర్తి మండలంలోని అంతయ్యగూడెం, రామలింగాలగూడెం, రాయినిగూడెం, మామిడాల, గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి ప్రారంభించారు. అనంతరం తిప్పర్తి మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ధాన్యం సరఫరా వాహనాలను ఆయన కలెక్టర్ తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ .. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మధ్య దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్వింటాకు రూ.2389/- మద్దతు ధర కల్పిస్తుందని, మిల్లర్లకు క్వింటాకు రూ.16-17 వందలకు అమ్మి మోసపోవద్దని తెలిపారు.

రైతులకు మెరుగైన, వేగంగా, పారదర్శకంగా సేవలు అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని మంత్రి అన్నారు. అనంతరం మామిడాల లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థుల మౌలికవసతుల కల్పనలో భాగంగా సైన్స్ లాబ్, డిజిటల్ లైబ్రరీ నిమిత్తం మంత్రి లక్ష రూపాయల తక్షణ సహాయంగా విరాళం అందజేశారు. వారికి పాఠశాల తరఫున పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు నూనె విష్ణు ఉపాధ్యాయ బృందం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తిప్పర్తి మాజీ జడ్పీటీసీ పాశం రాంరెడ్డి , డిసిసిబి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బద్దం సుధీర్,మాజీ ఎంపీటీసీ పాదూరి శ్రీనివాసరెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీమతి నాగమణి అంబేద్కర్, మాజీ వార్డ్ మెంబర్ గోనె కరుణాకర్ మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -