నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
టీఎస్పీఎస్సి గ్రూప్-1 లో ఎంపికైన ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు జిల్లాకు కేటాయించిన సందర్భంగా జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ గారిని మర్యాద పూర్వకంగా కలిశారు. శుక్రవారం ఐడీఓసీ ఛాంబర్ నందు ఇటీవల ప్రకటించిన గ్రూప్ -1 ఫలితాల్లో నన్నూరి మనోజ్ కుమార్ రెడ్డి(గ్రూప్-1 లో 11వ ర్యాంక్) మరియు జి.రాజ్ కుమార్ (గ్రూప్-1 లో 108వ ర్యాంక్) ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు గా ఎంపికైన సందర్భంగా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ట్రైనింగ్ డిప్యూటీ కలెక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు.జిల్లా స్థాయి అన్ని అంశాలను పరిశీలించి,పూర్తి అవగాహన కలిగించుకోవాలని సూచించారు. అలాగే,ప్రజలతో సానుకూల సంబంధాలు నెలకొల్పి,అన్ని సమస్యలు, సవాళ్లను అర్థం చేసుకొని, సమర్థవంతమైన సేవలు అందించాలని సూచనలు చేశారు. నల్లగొండ జిల్లా, మునుగోడు మండలం, గుడపూర్ గ్రామానికి చెందిన నన్నూరి మనోజ్ కుమార్ రెడ్డి TSPSC గ్రూప్-1 లో 11వ ర్యాంక్ సాధించి,జోగులాంబ గద్వాల్ జిల్లాలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. అలాగే, రంగా రెడ్డి జిల్లా, మీర్‌పేట్ గ్రామానికి చెందిన రాజ్ కుమార్ జి (గ్రూప్-1 లో 108వ ర్యాంక్) కూడా గద్వాల్ జిల్లాలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ గా బాధ్యతలను ప్రారంభించారు.