– మందుల స్టోర్ లో తనిఖీలు, ఆడిట్
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని చౌట్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజశ్రీ శుక్రవారం సాయంత్రం తనిఖీ చేశారు. జిల్లా సర్వేనెంబర్ అధికారి డాక్టర్ నాగరాజ్, జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్ రమేష్, ఆర్మూర్ డివిజన్ మలేరియా అధికారి సాయి, ప్రవీణ్ తో కలిసి ఆమె ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టోర్ ను తనిఖీ చేశారు. స్టోర్ లో ఉన్న మందులు, వాటి వివరాలు, మందుల నిల్వలు, వాటికి సంబంధించిన రికార్డులను, తదితర వాటిపై ఆడిట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని డాక్టర్ స్పందన, ఆరోగ్య విస్తరణ అధికారి సత్యనారాయణ, ఫార్మసిస్ట్ అరుణ్, ల్యాబ్ టెక్నీషియన్ పవన్, డిఓ మధు, సిబ్బంది పాల్గొన్నారు.
ఆస్పత్రిని తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారిణి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES