Saturday, October 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి 

ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి 

- Advertisement -

ఐలమ్మ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ మంజుల 
నవతెలంగాణ – పాలకుర్తి

గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకొని మద్దతు ధర పొందాలని ఐలమ్మ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ లావుడియా మంజుల రైతులకు సూచించారు. ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డి ల ఆదేశాల మేరకు ఐకెపి ఆధ్వర్యంలో మండలంలోని అయ్యంగారిపల్లి, కోతులాబాద్, దుబ్బ తండ ఎస్పి, లక్ష్మీనారాయణపురం, మైలారం, ముత్తారం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మార్కెట్ వైస్ చైర్మన్ అనుముల మల్లారెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంజుల మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి మద్దతు ధర అందించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని తెలిపారు.

సన్న రకం ధాన్యానికి క్వింటాలుకు 500 బోనస్ అందజేస్తుందని అన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసి ఆదుకున్న ఘనత ప్రజా ప్రభుత్వానికి దక్కిందని తెలిపారు. ధాన్యం అమ్మకాల్లో మధ్య దళారీలను ఆశ్రయించి మోసపోవద్దని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం శ్రీరాముల చంద్రశేఖర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి గౌడ్, కొడకండ్ల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు, పాలకుర్తి సొసైటీ మాజీ చైర్మన్ అడ్డూరి రవీందర్రావు, వీరమనేని యాకాంతరావు, దేవస్థాన మాజీ చైర్మన్ చిలువేరు కృష్ణమూర్తి, ముత్తారం మాజీ ఎంపీటీసీ బొమ్మగాని మానస భాస్కర్ గౌడ్, పాలకుర్తి ఏఈఓ జాటోతు రాధిక లతోపాటు ఐకెపి సీసీలు, కొనుగోలు కేంద్రాల నిర్వహకులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, పంచాయతీ కార్యదర్శులు, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -