- Advertisement -
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
యాదగిరిగుట్ట శుక్రవారం, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గొర్రెల దొంగతనం కేసులో నలుగురు వ్యక్తులను వంగపల్లి గ్రామానికి చెందిన తౌఫిక్ ఉమర్, నీలం కరుణాకర్, సీసా అరవింద్, ముడుగుల శ్రీను లను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి ఒక మహీంద్రా మారాజు ను స్వాధీన పరుచుకుని, వారిని జైలుకి తరలించడం జరిగినది. ఇట్టి వ్యక్తులు సెప్టెంబర్ చివరి వారంలో చోల్లేరు గ్రామంలో 14 గొర్రెలను దొంగతనం చేసినారు. బి భాస్కర్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో కృష్ణ స్వామి సబ్ ఇన్స్పెక్టర్, క్రైమ్ సిబ్బంది బి కిరణ్, నాగరాజు, శ్రీకాంత్, సాయి గణేష్ వీరిని ప్రెసిడెన్షియల్ సూట్ వద్ద తెల్లవారుజామున పట్టుకున్నారు.
- Advertisement -