- Advertisement -
హైదరాబాద్ : బహ్రెయిన్‌లో జరుగనున్న 3వ యూత్ ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత కబడ్డీ జట్టుకు తెలంగాణకు చెందిన లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి కోచ్‌గా వ్యవహరించనున్నాడు. 2005 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన జట్టులో శ్రీనివాస్ రెడ్డి సభ్యుడు. ప్రొ కబడ్డీలో తెలుగు టైటాన్స్ సహా హర్యానా స్టీలర్స్, జైపూర్ పింక్ పాంథర్స్‌కు కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. భారత సీనియర్ మహిళల జట్టుకు సైతం శిక్షణ సారథ్యం వహించిన శ్రీనివాస్ రెడ్డికి జాతీయ కోచ్‌గా మరో అవకాశం దక్కింది. తెలంగాణ కబడ్డీ సంఘం అధ్యక్షుడు కాసాని వీరేశ్, కార్యదర్శి మహేందర్ రెడ్డిలు శ్రీనివాస్‌రెడ్డికి అభినందనలు తెలిపారు.
- Advertisement -