- Advertisement -
న్యూఢిల్లీ : ప్రముఖ ఔషధ ఉత్పత్తుల కంపెనీ డాక్టర్ రెడ్డీస్‌లో ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ ఇటీవల 1.71 కోట్లకు పైగా షేర్లను సొంతం చేసుకుంది. దీంతో డాక్టర్ రెడ్డీస్‌లో దేశంలోని అతిపెద్ద సంస్థాగత పెట్టుబడిదారుల్లో ఒకటైన ఎల్‌ఐసీ ఎల్‌ఐసీ వాటా 10 శాతం దాటింది. ఈ ఏడాది జూన్ 8.21 శాతంగా ఉన్న వాటాను అక్టోబర్ 15 నాటికి 10.26 శాతానికి చేరిందని గురువారం రెడ్డీస్ తన ఫైలింగ్‌లో వెల్లడించింది. తాజాగా తమ సంస్థలో ఎల్‌ఐసీ 1,71,40,819 షేర్లను సొంతం చేసుకుందని.. ఇది అదనంగా 2 శాతం వాటాకు సమానమని వెల్లడించింది.
- Advertisement -