Saturday, October 18, 2025
E-PAPER
Homeతాజా వార్తలుమెహుల్ చోక్సీ అప్పగింతకు బెల్జియం కోర్టు ఆమోదం

మెహుల్ చోక్సీ అప్పగింతకు బెల్జియం కోర్టు ఆమోదం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.13,500 కోట్ల కుంభకోణానికి పాల్పడి విదేశాలకు పారిపోయిన మెహుల్ చోక్సీని భారత్‌కు అప్పగించేందుకు బెల్జియం కోర్టు ఆమోదం తెలిపింది. ఆంట్వెర్ప్‌లోని కోర్టు చోక్సీ అరెస్టును సమర్థించడమే కాక, భారత్‌కు అప్పగించేందుకు అనుమతినిస్తూ తీర్పు వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో బెల్జియం పోలీసులు చోక్సీని అరెస్ట్ చేశారు. అయితే, చోక్సీకి పై కోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. ఇది భారత్‌కు ఒక కీలక ముందడుగుగా విశ్లేషకులు భావిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -