Saturday, October 18, 2025
E-PAPER
Homeతాజా వార్తలుశిఖండి పాత్ర పోషిస్తున్న బీజేపీ: జూలకంటి

శిఖండి పాత్ర పోషిస్తున్న బీజేపీ: జూలకంటి

- Advertisement -

– మిర్యాలగూడలో బందు ప్రశాంతం 
– బీసీ సంఘాల బంద్ కు అఖిలపక్షం మద్దతు
– బస్టాండ్ లో నిలిచిన ఆర్టీసీ బస్సులు 
– మూతపడ్డ విద్యాసంస్థలు, దుకాణాలు 
నవతెలంగాణ మిర్యాలగూడ 
: 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు కోసం బీసీ సంఘాలు చేపట్టిన తెలంగాణ బంద్ లో భాగంగా మిర్యాలగూడలో శనివారం బంద్ ప్రశాంతంగా నడిచింది. తెల్లవారుజామునే ఆర్టీసీ బస్టాండ్ దగ్గర బీసీ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించగా సిపిఎం సిపిఐ ఎంపీపీఐయు కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలు, ఎమ్మార్పీఎస్, మాల మహానాడు,  వడ్డెర సంఘం మద్దతు తెలిపాయి.దీంతో బస్టాండ్ లోని ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. బస్సులు నడవకపోవడంతో ప్రయాణికులుకొంత ఇబ్బంది పడ్డారు. వ్యాపార దుకాణాలు, హోటల్లు, పెట్రోల్ బంకులు, బ్యాంకులు, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా మూసివేసి బందుకు సహకరించారు.

అఖిలపక్షం ఆధ్వర్యంలో పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలు వేరువేరుగా ర్యాలీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, రవి నాయక్, డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి, బావాండ్ల పాండు, రాగిరెడ్డి మంగారెడ్డి, వరలక్ష్మి, తిరుపతి రామ్మూర్తి, దేశి రామ్ నాయక్, గోవర్ధన, అరుణ, కృష్ణయ్య, నాగేశ్వరరావు నాయక్, బంటు వెంకటేశ్వర్లు, వస్కుల మట్టయ్య, చిరుమారి కృష్ణయ్య, రామలింగ యాదవ్, మెరుగు రోశయ్య, వెంకటేష్ గౌడ్, ఎండి సోయాబ్, బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ జె రాజు, నాగేశ్వరరావు, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి, బీసీ సంఘాల నాయకులు తిరుమలగిరి అశోక్, మహేష్ గౌడ్, చిరంజీవి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


శిఖండి పాత్ర పోషిస్తున్న బీజేపీ : జూలకంటి
 42 శాతం బీసీ బిల్లును అమలు చేయాల్సిన బీజేపీ రాష్ట్రంలో శిఖండి పాత్ర పోషిస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆరోపించారు. తెలంగాణలో ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు, ఎంపీలు ఎమ్మెల్యేలు ఇక్కడ బీసీ బిల్లుకు మద్దతు తెలుపుతూనే కేంద్రంలో బీసీ బిల్లు అమలు కాకుండా ఆడుకుంటున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ బిల్లు అమలు కోసం కులగణన చేసి, అసెంబ్లీ తీర్మానం చేశారని, ఆర్డినెన్స్ జారీ చేసిందని, చివరికి జీవో జారీ చేసిన బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్ ఉండడం వల్ల బిల్లు అమలు కావడం లేదన్నారు. బిల్లును ఆమోదించాల్సిన గవర్నర్, రాష్ట్రపతి, పార్లమెంటు పై బిజెపి ప్రజా ప్రతినిధులు ఒత్తిడి చేసి అమలు చేయించి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. బిజెపి ద్వంద వైఖరిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని భవిష్యత్తులో బీజేపీ నాయకులను ప్రజలు అడ్డుకుంటారని చెప్పారు. ఇప్పటికైనా బీసీ బిల్లు అమలు కోసం బిజెపి ప్రజా పతినిధులు చొరవ చూపాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -