- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : నిజామాబాద్ సీసీఎస్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ప్రమోద్ హత్యకు గురైన ఘటనపై డీజీపీ శివధర్‌రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నిందితుడిని వెంటనే పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌ను డీజీపీ ఆదేశించారు. మల్టీ జోన్-1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డిని ఘటనా స్థలాన్ని పర్యవేక్షించాలని, మరణించిన కానిస్టేబుల్ కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి అవసరమైన సహాయం అందించాలని సూచించారు.
- Advertisement -