- Advertisement -
నవతెలంగాణ-ఆర్మూర్: జిల్లా కేంద్రంలో శుక్రవారం సీసీఎస్‌కు చెందిన కానిస్టేబుల్ ప్రమోద్ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విధుల్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్‌ను హత్యచేసిన రియాజ్‌ని చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.అలాగే ప్రమోద్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, ప్రమోద్ ఆత్మకు శాంతి చేకూరాలని ఎమ్మెల్యే కోరారు.
- Advertisement -