Sunday, October 19, 2025
E-PAPER
Homeజిల్లాలుబంద్ విజయవంతం..

బంద్ విజయవంతం..

- Advertisement -

బంద్ పాల్గొన్న రాజకీయ పార్టీల నాయకులు

నవతెలంగాణబెజ్జంకి

బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని తలపెట్టిన రాష్ట్రవ్యాప్త బంద్ మండలంలో విజయవంతమైంది. శనివారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,అఖిలపక్షం నాయకులు బంద్ నిర్వహించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి అన్నారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, ఉపాధ్యక్షులు లింగాల శ్రీనివాస్, అక్కరవేణీ పోచయ్య, కర్రావుల సందీప్,గూడెల్లి శ్రీకాంత్,భైర సంతోష్,మాజీ సర్పంచ్ రావుల నర్సయ్య, జెరిపోతుల మధు, తదితరులు పాల్గొన్నారు.

సవరణ చేసి అమలు చేయాలి: బీజేపీ

రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసి తీరుతామని చెబుతోందని..42 శాతం రిజర్వేషన్ యందు సవరణ చేపట్టి సుమారు 7 శాతం మైనార్టీ రిజర్వేషన్ తొలగించి పూర్తిస్థాయిలో బీసీ రిజర్వేషన్ అమలు చేయాలన బీజేపీ మండలాధ్యక్షుడు కొలిపాక రాజు డిమాండ్ చేశారు.

బీసీ రిజర్వేషన్ సాధించుకోవాలి

తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నట్టే 42 శాతం బీసీ రిజర్వేషన్ సాధించుకోవాలని మండల బీఆర్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -