Sunday, October 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రెంజల్ మండలంలో బీసీ బందు సంపూర్ణం... 

రెంజల్ మండలంలో బీసీ బందు సంపూర్ణం… 

- Advertisement -

నవతెలంగాణ – రెంజల్ : మండలంలోని 17 గ్రామ పంచాయతీల పరిధిలో బీసీ బందుకు సంపూర్ణ మద్దతు లభించింది. అఖిలపక్షాల ఆధ్వర్యంలో బందుకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులతో పాటు, సీపీఐ(ఎంఎల్) ప్రజాపంతా, వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులందరూ సంపూర్ణంగా మద్దతు ఇచ్చారు. మండలంలోని వాణిజ్య వ్యాపార సంస్థల తో పాటు, విద్యాసంస్థలను సైతం వారు స్వచ్ఛందంగా బహిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ వెంటనే ఆమోదించాలని కోరుతూ.. బందుకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సాయిబాబా గౌడ్, కార్తీక్ యాదవ్, వెల్మల నరసయ్య, ఏ అనిల్, గంగాధర్, శివ కుమార్, సిపిఐ ఎంఎల్ ప్రజా పంట నాయకులు పుట్టి నడిపి నాగన్న,పార్వతి రాజేశ్వర్, గంగాధర్, కుద్దూస్, సురేష్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -