Sunday, October 19, 2025
E-PAPER
Homeఆటలుతొలి వన్డే.. మ్యాచ్‌కు వర్షం అడ్డంకి

తొలి వన్డే.. మ్యాచ్‌కు వర్షం అడ్డంకి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా పెర్త్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి వన్డేకు వరుణుడు అడ్డుతగులుతున్నాడు. 8.5 ఓవర్ల మధ్య ఒకసారి ఆటకు అంతరాయం కలిగించిన వర్షం.. 11.5 ఓవర్ల మధ్య మరోమారు ఆటను అడ్డుకుంది. వర్షం పెరగడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. అప్పటికి భారత్ 3 వికెట్ల నష్టానికి 37 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ (6), అక్షర్ పటేల్ (7) క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. భారత్‌ను భయపెట్టింది. రోహిత్ శర్మ (8), విరాట్ కోహ్లీ (0), శుభమన్ గిల్ (10)ను వెంటవెంటనే పెవిలియన్ పంపి భారత్‌ను కష్టాల్లోకి నెట్టింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -