నవతెలంగాణ కల్వకుర్తి టౌన్ : స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని తెలంగాణ వ్యాప్తంగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన బందులో భాగంగా కడ్తాల్ మండల కేంద్రంలో పాల్గొన్న మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి మాట్లాడుతూ జనాభాలో మేమెంతో మాకు అంత భాగం ఉండాలని బీసీలు ఎవరి దయా దక్షిణాలపై ఆధారపడి బతకాల్సిన అవసరం లేదని, దేశంలో దాదాపూ 60 శాతం ఉన్న బీసీలకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి తీవ్రమైన అన్యాయం జరుగుతుందని,ఇప్పటికైనా బీసీలు మేలుకోకపోతే భవిష్యత్తు తీవ్ర అంధకారం అవుతుందని హెచ్చరించారు, ప్రతి గడప నుంచి ఒక బీసీ ఉద్యమం కోసం తరలి రావాలని, బీసీలంతా కులాలకు అతీతంగా ఐక్యమత్యంతో పోరాడి స్థానిక సంస్థలతోపాటు ఎమ్మెల్యే ఎంపీ స్థానాల్లో కూడా రిజర్వేషన్ సాధించాలని పిలుపునిచ్చారు…ఈసందర్భంగా తల్లోజు ఆచారి రిజర్వేషన్లపై చెప్పిన కథ అందర్నీ ఎంతో ఆకట్టుకొని ఆలోచింపచేసేలా ఉందని బీసీ సంఘాలు బీసీ మేధావులు పేర్కొనడం గమనార్హం
అసెంబ్లీ పార్లమెంటు సీట్లలో కూడా బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి : తల్లోజు ఆచారి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES